న్యూఢిల్లీ: సుదూర గెలాక్సీ నుంచి వెలువడిన రేడియో సిగ్నల్‌ను భారత ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. మన దేశంలో భారీ మీటర్వేవ్ రేడియోటెలిస్కోప్ ద్వారా దీనిని గుర్తించినట్టు తెలిపారు. విశ్వం తొలినాళ్ల రహస్యాలను తెలుసుకునేందుకు ఈ సిగ్నల్ ఉపయోగపడుతుందని చెప్పారు. పరిశోధకులు అర్ణబ్ మాట్లాడుతూ.. సుదూ ర గెలాక్సీకి చెందిన సిగ్నల్‌ను గుర్తించామన్నారు. ఇది విశ్వం వయసు 4.9 బిలియన్ ఏండ్లు ఉన్నప్పుడు వెలువడినదని తెలిపారు. ప్రస్తుతం విశ్వం వయసు 13.6 బిలియన్ ఏండ్లు అని, అంటే 8 బిలియన్ ఏండ్ల కిందటి పరిస్థితులను తెలుసుకునేందుకు ఈ సిగ్నల్ ఉపయోగపడుతుందని చెప్పారు.