QS Best Student Cities| న్యూఢిల్లీ: ఉన్నత విద్యాభ్యాసం కోసం అనేక మంది విద్యార్థులు దేశంలో ప్రధాన నగరాలతోపాటు విదేశాలకు వలస వెళ్తుంటారు. మరి విద్యార్థులకు ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన నగరం ఏంటో తెలుసా? క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ సర్వే ప్రకారం.. బ్రిటన్ రాజధాని లండన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.
జపాన్ రాజధాని టోక్యో రెండో స్థానంలో నిలువగా, దక్షిణకొరియా రాజధాని సియోల్ మూడో స్థానం దక్కించుకున్నది. నాణ్యమైన బోధన, అందుబాటు ధరల్లో నివాస సదుపాయాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోని ఈ ర్యాంకులను ప్రకటించారు. విద్యకు గమ్యస్థానాలుగా నిలిచిన 160 ప్రధాన నగరాలకు ర్యాంకులను కేటాయించారు.
జాబితాలో భారత్ నుంచి ఒక్క నగరం కూడా టాప్-100లో చోటు దక్కించుకోలేకపోయింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై 118వ ర్యాంకు దక్కింది. అయితే గత ఏడాది కంటే 15 స్థానాలు దిగజారింది. ఢిల్లీ 132, బెంగళూరు 147, చెన్నై 154వ స్థానాల్లో నిలిచాయి. గత ఏడాదితో పోలిస్తే బెంగళూరు 15 స్థానాలు, చెన్నై 33 స్థానాలు దిగజారాయి.
లండన్, టోక్యో, సియోల్, మెల్బోర్న్, మునిచ్, పారిస్, సిడ్నీ, బెర్లిన్, జ్యురిచ్, బోస్టన్