న్యూఢిల్లీ, ఆగస్టు 1: మనం వాడుతున్న మందులు సురక్షితమైనవా, హానికరమైనవా? అసలు వాటిని ఎవరు, ఎప్పుడు తయారు చేశారు? తదితర సందేహాలు చాలామందిలో వస్తుంటాయి. అయితే వాటి గురించి తెలుసుకునే మార్గం ఉండేది కాదు. అయితే ఇప్పుడా ఆ ఇబ్బంది లేదు. మనం వాడుతున్న మందుల గురించిన పూర్తి వివరాలు ఒక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు మన కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. ఇక నుంచి ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి తయారయ్యే దేశంలోని 300 ప్రముఖ ఔషధ బ్రాండ్లు తాము తయారు చేసిన మందులపై విధిగా క్యూఆర్ కోడ్ కానీ, బార్ కోడ్ కానీ ముద్రించాలి. మందుల స్ట్రిప్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే అవి ఏ బ్యాచ్‌కు చెందినవి, లైసెన్స్ నంబర్, కాంబినేషన్, తయారీదారి పేరు, చిరునామా, ఎక్స్పైరీ తేదీ తదితర వివరాలన్నీ మనకు లభిస్తాయి.