హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): గుజరాత్ ఎన్నికల వేళ బీజేపీకి షాక్ తగిలింది. సూరత్ ఉపాధ్యక్షుడు పీవీఎస్ శర్మ రాజీనామా చేశారు. గుజరాత్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌కు రాజీనామా లేఖ పంపారు. పారిశ్రామికవేత్తలను రక్షించడానికి జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా కలిచివేశాయన్నారు.
తనపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని, తనను ఎకువ కాలం జైల్లో ఉంచేందుకు ఈడీ తనపై లేని కేసు పెట్టిందని ధ్వజమెత్తారు.