గుర్రపుస్వారీ కేవలం మనుషులే చేస్తారా? నేను చేయకూడదా? అని అనుకుందేమో ఓ కుక్కపిల్ల. గుర్రమెక్కి నగర రోడ్లపై దూసుకుపోయింది. ఈ అసాధారణ దృశ్యం నెటిజన్లకు కెనడియన్ టీవీ సిరీస్ ప్రముఖ కార్టూన్ పా పెట్రోల్‌ను గుర్తు చేసింది. అదే సమయంలో దీనిని ఇండియన్ నెటిజన్లు మజ్నూభాయ్ సినిమాలో హీరో అనిల్‌కపూర్ గీసిన గుర్రంపై గాడిద పెయింటింగ్‌తో పోల్చారు. ఈ గుర్రపు స్వారీ చేస్తున్న కుక్కపిల్ల వీడియో ఆన్లైన్లో చక్కర్లుకొడుతున్నది.
ఈ వీడియోను ‘యోడా4ఎవర్’ అనే పేజీ ద్వారా ట్విటర్లో అప్లోడ్ చేశారు. నగర రోడ్లపై పరుగెత్తుతున్న గుర్రంపై కుక్కపిల్ల దర్జాగా నిల్చుని ఉంటుంది. సిగ్నల్ పడినప్పుడు అవి ఆగిపోయాయి. గ్రీన్‌లైట్ పడగానే గుర్రం మళ్లీ పరుగెత్తడం ప్రారంభించింది. ఈ వీడియో ఇప్పటివరకూ 3 లక్షలకు పైగా వీక్షణలను సొంతం చేసుకున్నది. ఇప్పటివరకూ 18వేల మంది లైక్ చేశారు.
Paw patrol..🐕🐾🏇😅 pic.twitter.com/SaeOh8Y8UQ
— 𝕐o̴g̴ (@Yoda4ever) July 16, 2022