చండీగఢ్, సెప్టెంబర్ 21: పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ చర్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. విశ్వాస పరీక్ష కోసం రాష్ట్ర క్యాబినెట్ సిఫారసు మేరకు అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌కు మంగళవారం అనుమతి ఇచ్చిన గవర్నర్.. సంబంధించిన ఉత్తర్వులను ఒక్కరోజులోనే బుధవారం వెనక్కు తీసుకోవడం వివాదంగా మారింది.
పంజాబ్ బీజేపీ చీఫ్ అశ్వని శర్మ, ఇతర ప్రతిపక్షాల నేతలు కలిసిన తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సెషన్ ఉత్తర్వులను గవర్నర్ పురోహిత్ ఉపసంహరించుకోవడంపై అధికార ఆప్ మండిపడింది. గవర్నర్ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. రాష్ట్ర మంత్రిమండలి పిలుపునిచ్చిన అసెంబ్లీ సెషన్‌ను గవర్నర్ ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించారు.