Watch: పొరపాటున గన్‌తో పోలీస్ కాల్పులు.. మొబైల్ షాపు ఉద్యోగికి గాయాలు
అమృత్సర్ నార్త్ ఏసీపీ వరీందర్ సింగ్ ఈ సంఘటనపై స్పందించారు. మొబైల్ షాపులో రివ్వాలర్ మిస్‌ఫైర్ చేసిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
చండీగఢ్: పొరపాటున గన్‌తో పోలీస్ అధికారి కాల్పులు జరిపాడు. దీంతో మొబైల్ షాపులో పని చేసే ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఈ సంఘటన జరిగింది. మొబైల్ షాపునకు ఒక పోలీస్ అధికారి వెళ్లాడు. ఆయన వద్ద సర్వీస్ రివాల్వర్ ఉంది. దానిని కౌంటర్ టేబుల్‌పై ఉంచాడు. రివ్వాలర్ పనితీరును ఆ షాపులోని సిబ్బందికి వివరిస్తున్నాడు. ఇంతలో ప్రమాదవశత్తూ ఆ రివాల్వర్ మిస్‌ఫైర్ అయ్యింది. దీంతో ఆ మొబైల్ షాపులో పని చేసే ఒక వ్యక్తి శరీరంలోకి బులెట్లు దూసుకెళ్లాయి. ఆ వ్యక్తి అక్కడే కుప్పుకూలిపోయాడు. వెంటనే తేరుకున్న మిగతా సిబ్బంది అతడ్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బుల్లెట్ గాయాలైన ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, అమృత్సర్ నార్త్ ఏసీపీ వరీందర్ సింగ్ ఈ సంఘటనపై స్పందించారు. మొబైల్ షాపులో రివ్వాలర్ మిస్‌ఫైర్ చేసిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. గాయపడిన ఆ షాపు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉందన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆ మొబైల్ షాపులోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video: Punjab Cop "Accidentally" Fires At Mobile Shop Employee In Amritsar https://t.co/z4TgmupAha pic.twitter.com/bJKmF06cnG
— NDTV (@ndtv) October 20, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

