చండీఘర్ : బాలీవుడ్ నటుడు సోనూసూద్ సోదరి మాళివిక సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా కన్ఫార్మ్ చేసింది. మోగ నియోజకవర్గం నుంచి మాళివిక పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.
అయితే ఆ స్థానం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్జోత్ కమల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తనకు మళ్లీ టికెట్ ఇవ్వకుండా, మాళవికకు ఆ స్థానాన్ని కేటాయించడాన్ని కమల్ తప్పుబట్టారు. దీంతో హర్జోత్ కమల్.. భారతీయ జనతా పార్టీ గూటికి చేరారు. శనివారం రోజు కమల్ బీజేపీలో చేరారు. హర్జోత్ కమల్‌కు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు 86 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ శనివారం ప్రకటించింది. చమ్‌కౌర్ సాహిబా నుంచి సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ పోటీ చేయనున్నారు. అమృత్ సర్ ఈస్ట్ నియోజకవర్గం నవజోత్ సింగ్ సిద్ధూ బరిలో దిగనున్నారు. పంజాబ్ అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 14న పోలింగ్ నిర్వహించి, మార్చి 10న కౌంటింగ్ చేయనున్నారు.
Dr Harjot Kamal, Punjab Congress MLA from Moga joins the Bharatiya Janata Party in the presence of Union Minister Gajendra Singh Shekhawat in Chandigarh today pic.twitter.com/rsK3LktpNa
— ANI (@ANI) January 15, 2022