CM Bhagwant Mann | న్యూఢిల్లీ: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అత్యంత అరుదైన ‘లెప్టోస్పైరోసిస్’ అనే బ్యాక్టీరియా వ్యాధి బారినపడ్డారు. కుక్కలు, ఎలుకలు మొదలైనవాటి విసర్జితాల నుంచి ఈ బ్యాక్టీరియా మనుషులకు సోకుతుందని, కలుషిత ఆహారం, నీటితో ఈ బ్యాక్టీరియా సీఎం భగవంత్ మాన్కు సోకినట్టు భావిస్తున్నామని న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ దవాఖాన వైద్యులు తెలిపారు.
ఈ వ్యాధి సోకినవాళ్లలో అధిక జ్వరంతో కూడిన ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాంతులు, డయేరియా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. రెండు వారాలపాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవటం ద్వారా ఈ వ్యాధి తగ్గుతుందని అన్నారు.