Pune Porsche horror | పూణే యువకుడి రక్త నమూనాలు డస్ట్‌బిన్‌లో.. ఇద్దరు డాక్టర్లు అరెస్ట్
Pune Porsche horror | మహారాష్ట్రలోని ఫూణేలో మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇద్దరు వ్యక్తుల మరణానికి కారణమైన యువకుడ్ని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రియల్టర్ కుమారుడైన 17 ఏళ్ల యువకుడి రక్త పరీక్ష నివేదికను తారుమారు చేసేందుకు ఇద్దరు డాక్టర్లు ప్రయత్నించారు.
ముంబై: మహారాష్ట్రలోని ఫూణేలో మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇద్దరు వ్యక్తుల మరణానికి కారణమైన యువకుడ్ని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రియల్టర్ కుమారుడైన 17 ఏళ్ల యువకుడి రక్త పరీక్ష నివేదికను తారుమారు చేసేందుకు ఇద్దరు డాక్టర్లు ప్రయత్నించారు. (Pune Porsche horror) పోలీసుల దర్యాప్తులో ఈ కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ససూన్ ఆసుపత్రిలో ఈ నెల 19న యువకుడి నుంచి సేకరించిన రక్త నమూనాను డస్ట్‌బిన్‌లోకి విసిరేసినట్లు పూణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి రక్త నమూనాను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలుసుకున్నారు.
కాగా, ససూన్ హాస్పిటల్ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ అజయ్ తవాడే సూచనల మేరకు డాక్టర్ శ్రీహరి హల్నోర్ రక్త నమానాలు మార్పిడి చేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఇద్దరు వైద్యుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగిన రోజున డాక్టర్ అజయ్‌తో నిందితుడైన యువకుడి తండ్రి ఫోన్లో మాట్లాడినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో యువకుడి రక్త పరీక్ష నివేదికను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన డాక్టర్ అజయ్, డాక్టర్ హరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

