పుణే: పోర్షే కారును విచక్షణారహితంగా నడిపి, ఇద్దరు టెకీల ప్రాణాలను బలి తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మైనర్ బాలుని తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఆ మైనర్ బాలుని రక్త నమూనాలను ఆమె రక్త నమూనాలతో మార్చినట్లు నిర్ధారణ కావడంతో ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జువనైల్ హోంలో అబ్జర్వేషన్లో ఉన్న మైనర్‌ను అతని తల్లి సమక్షంలో దాదాపు ఓ గంటసేపు పోలీసులు విచారించారు.