Dr. Umar Nabi: సూసైడ్ బాంబర్ ఉమర్ నబీ ఇంటిని కూల్చివేసిన భద్రతా సిబ్బంది.. వీడియో
Dr Umar Nabi: పుల్వామాలో ఉన్న డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని ఇవాళ భద్రతా దళాలు పేల్చివేశాయి. ఎర్రకోట వద్ద కారులో ఉమర్ నబీ ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారులో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీ(Dr. Umar Nabi) అలియాస్ ఉమర్ మహమ్మద్ ఇంటిని ఇవాళ భద్రతా దళాలు కూల్చివేశాయి. కశ్మీర్లోని పుల్వామాలో ఉన్న ఆ ఇంటిని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు కూల్చివేత ప్రక్రియ కొనసాగింది. పేలుడు పదార్ధాలు దాచేందుకు ఆ ఇంటి ఉమర్ నబీ వాడుకున్నట్లు గుర్తించారు. హుందయ్ ఐ20 కారుతో పేలుడుకు పాల్పడిన ఉమర్ నబీ.. డీఎన్ఏ శ్యాంపిళ్లను కన్ఫర్మ్ చేశారు. ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 13కాగా, 20 మందికిపైగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఎర్రకోట సమీపంలోని నేతాజీ సుభాష్ మార్గ్ వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పేలుడు ఘనట జరిగింది. ఉగ్రకార్యకలాపాలకు మద్దతు ఇచ్చే వారికి ఇలాంటి శిక్షే ఉంటుందన్న ఉద్దేశాన్ని తెలిపేందుకు ఉమర్ నబీ ఇంటిని పేల్చివేశారు. భారత భూభాగంపై ఉగ్రకార్యకలాపాలకు చోటు లేదన్న సంకేతాన్ని వినిపించారు.
VIDEO | Delhi terror blast: The residence of Dr Umar Nabi, accused in the Red Fort blast, has been demolished in Pulwama, Jammu and Kashmir.#Delhiblast #Pulwama #Terror
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/xJSVxkAZkY
— Press Trust of India (@PTI_News) November 14, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

