చెన్నై: పోక్సో కేసు(POCSO Case)లో పుదుచ్చరికి చెందిన 24 ఏళ్ల నిందితుడికి స్థానిక ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. మంగళవారం స్పెషల్ కోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది. స్పెషల్ కోర్టు జడ్జీ ఎండీ సుమతి ఆ ఆదేశాలు ఇచ్చారు. ఆర్ ఎజిలరసన్ అలియాస్ బాంబ్ ఎజిల్ అనే వ్యక్తి.. 2023లో 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పుదుచ్చరిలోని అరుంపర్తపురంలో బాలికపై లైంగిక దాడి చేశాడు. ఆ కేసులో ఇవాళ స్పెషల్ కోర్టు తీర్పును ఇచ్చింది. బాధితురాలికి 4 లక్షల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని కూడా కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.