న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పౌరులు తరలిరావాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కోరారు. బీజేపీ కార్యకర్తలు ఢిల్లీకి చేరుకుని రాళ్లు రువ్వడం, లాఠీల ప్రయోగం వంటి చర్యలకు పాల్పడాలని ఆ పార్టీ రెచ్చగొడుతున్నదని, ప్రభుత్వం తన చర్యలతో దేశంలో అంతర్యుద్ధం రావాలని కోరుకుంటున్నదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని హెచ్చరిస్తున్నామన్నారు. యువత జవాబుదారీతనం కోరుకుంటున్నదే తప్ప, గతంలో చేసిన తప్పులు పునరావృతం చేయమని అడగటం లేదని పేర్కొన్నారు.