విద్యాసంస్థల మూసివేతకు నిరసనగా బీహార్‌లో ఆందోళనలు

ససారామ్: కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతన్న నేపథ్యంలో బీహార్‌లో స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ ఇన్స్టిట్యూట్లను మరో వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు బీహార్ ప్రభుత్వం ఇటీవల ఆదేశాల జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలకు నిరసనగా ఇవాళ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ససారామ్‌లో విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. ఆ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. సంఘ విద్రోహక శక్తులు ఈ దాడికి పురిగొల్పినట్లు పోలీసులు ఆరోపించారు. పోలీసులు ఎన్పోర్స్మెంట్ డ్రైవ్ చేపట్టిన సమయంలో విద్యార్థులు రాళ్లు రువ్వారు. ఆ సమయంలో వాహనాలు ధ్వంసం అయ్యాయి. గౌరీలక్ష్మీ కాలనీలో విద్యార్థులు టైర్లు తగలబెట్టారు. ససారామ్ పట్టణంలో వందల సంఖ్యలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. కాంపిటీటివ్ పరీక్షలకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. గాయపడ్డ ఏడు మంది పోలీసుల్ని వివిధ హాస్పిటల్స్‌లో చికిత్స కోసం చేర్చారు. ఏప్రిల్ 11వ తేదీ వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ఇటీవల జిల్లా మెజిస్ట్రేట్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్లు విద్యార్థులను రెచ్చగొట్టడం వల్లే ఈ ఘర్షణ తలెత్తినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

