Ranya Rao | బెంగళూరు: సుమారు 14 కోట్ల రూపాయల బంగారాన్ని దుబాయి నుంచి స్మగ్లింగ్ చేస్తూ చిక్కిన కన్నడ నటి రన్యారావు ఉదంతంలో ఒక ప్రముఖ రాజకీయ నేత హస్తం ఉందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. తనకున్న రాజకీయ బంధాలు, సంబంధాలతో పనిలేకుండా చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందని సీఎం సిద్ధరామయ్య న్యాయ సలహాదారు పొన్నన్న వ్యాఖ్యలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
నటి ఇంట్లో దొరికిన ఆభరణాలు బెంగళూరులోని ఒక జ్యూయలరీ బొటిక్ నుంచి కొనుగోలు చేసినట్టు సమాచారం. పాథమిక దర్యాప్తు ప్రకారం ఒక ప్రముఖ రాజకీయ నేత తరపున వాటిని కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు.