న్యూఢిల్లీ, ఆగస్టు 9: నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాపై కొందరు ఎంపీలు చేసిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపుతున్నట్టు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ బుధవారం వెల్లడించారు. తమ అనుమతి లేకుండా ఈ నెల 7న హౌస్ ప్యానల్లో తమ పేర్లను చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎంపీలు సస్మిత్ పాత్ర, ఎస్.ఫాన్గ్నాన్ కోయంక్, ఎం తంబిదురై, నరహరి అమీన్లు.. జగదీప్కు ఫిర్యాదు చేశారు. నిబంధన 203 ప్రకారం దీనిని పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా ప్రివిలేజ్ కమిటీని ఆయన ఆదేశించారు.