ఇకపై తాగి డ్రైవింగ్ చేయను.. మందుబాబులతో 1000 సార్లు రాయించిన పోలీసులు
Kerala | కేరళ పోలీసులు మందుబాబులకు వింత శిక్ష విధించారు. పాఠశాల విద్యార్థుల తరహాలో మందుబాబులతో ఇంపోజిషన్ రాయించారు. ఇకపై తాగి డ్రైవింగ్ చేయను అని మందుబాబులతో 1000 సార్లు రాయించారు.
Kerala | కేరళ పోలీసులు మందుబాబులకు వింత శిక్ష విధించారు. పాఠశాల విద్యార్థుల తరహాలో మందుబాబులతో ఇంపోజిషన్ రాయించారు. ఇకపై తాగి డ్రైవింగ్ చేయను అని మందుబాబులతో 1000 సార్లు రాయించారు. అయితే ఆదివారం కొచ్చిలో ఓ ప్రయివేటు బస్సు.. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనతో హైకోర్టు జోక్యం చేసుకుని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కేరళ పోలీసులు సోమవారం ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పట్టుబడిన మందుబాబులకు త్రిపునితుర పోలీసులు వింత శిక్ష విధించారు.
వారందరినీ స్టేషన్‌కు తీసుకొచ్చి ఇకపై తాగి డ్రైవింగ్ చేయను అని మందుబాబులతో 1000 సార్లు రాయించారు. అయినప్పటికీ వారికి అసలు శిక్ష తప్పదని పోలీసులు పేర్కొన్నారు. మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేసి, వారి లైసెన్సులను సస్పెండ్ చేయనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

