Mumbai EVM Controversy : ముంబై ఈవీఎం వివాదం పెను దుమారం రేపుతోంది. ఈ ఉదంతంపై మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. జూన్ 4న ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ సమయంలో వివాదంపై జూన్ 14న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఈ విషయంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు.
కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ను ఎవరు అనుమతించారని, ఆ ఫోన్ను ఎందుకు వినియోగించారని ప్రశ్నించారు. ఓటీపీని జనరేట్ చేసి ఆ ఓటీపీతో ఈవీఎంలను తెరిచారని అన్నారు. ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయని పేర్కొన్నారు. అసలు ఈ వ్యవహారంపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని వెల్లడించడం లేదని, ఎఫ్ఐఆర్ విషయంలో గోప్యత పాటిస్తున్నారని మహారాష్ట్ర మాజీ సీఎం పేర్కొన్నారు.
కాగా, ఈ వివాదంపై ముంబై సబర్బన్ రిటర్నింగ్ అధికారి వందన సూర్యవంశీ వివరణ ఇచ్చారు. ఈవీఎంను తెరిచేందుకు ఎలాంటి ఓటీపీ అవసరం లేదని స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతిక ఫీచర్లతో ఈవీఎం తయారవుతుందని, అందులో కమ్యూనికేషన్ డివైజ్ ఉండదని చెప్పారు.ఈవీఎంల్లో సాంకేతికంగా ఎలాంటి లోటుపాట్లు ఉండవని, దీన్ని ఓపెన్ చేసేందుకు ఓటీపీ అవసరం లేదని ఆమె చెప్పుకొచ్చారు.
Read More :
Minister Seethakka | మత్తు పదార్థాల వల్లే నేరాలు పెరుగుతున్నాయి : మంత్రి సీతక్క