భోపాల్: ప్రైమ్ మెరిడియన్ ఉజ్జయినీ గుండా వెళ్తుందని మధ్యప్రదేశ్ కొత్త సీఎం మోహన్ యాదవ్ (Madhya Pradesh CM Mohan Yadav) తెలిపారు. ప్రపంచ కాలాన్ని మారుస్తామని చెప్పారు. ప్రపంచ కాలానికి సూచనగా వినియోగించే రేఖాంశ రేఖ, ప్రైమ్ మెరిడియన్‌ను ఇంగ్లాండ్‌లోని గ్రీన్విచ్ నుంచి ఉజ్జయినీకి మార్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన సీఎం మోహన్ యాదవ్, పాశ్చాతీయకరణకు వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యలు చేశారు. 300 ఏళ్ల కిందటే ప్రపంచ ప్రామాణిక సమయాన్ని భారతదేశం నిర్ణయించిందని తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో సమయాన్ని నిర్ధారించే పరికరం ఇప్పటికీ ఉందని చెప్పారు. ‘భారతదేశ ప్రామాణిక సమయం దాదాపు 300 సంవత్సరాల కిందటే ప్రపంచానికి తెలుసు. అయినప్పటికీ ప్రామాణిక సమయాన్ని పారిస్ నిర్ణయించింది. ఆ తర్వాత బ్రిటీష్ వారు దీనిని అనుసరించారు. గ్రీన్విచ్ను ప్రధాన మెరిడియన్‌గా పేర్కొన్నారు’ అని ఆయన అన్నారు.
కాగా, అర్ధరాత్రి 12 గంటల తర్వాత రోజు ప్రారంభం కావడాన్ని సీఎం మోహన్ యాదవ్ ప్రశ్నించారు. ఎవరూ తమ రోజును అర్ధరాత్రి నుంచి ప్రారంభించరని అన్నారు. సూర్యోదయం లేదా కొంత సమయం తర్వాత ప్రజలు మేల్కొంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ ప్రైమ్ మెరిడియన్ ఉజ్జయినీ అని నిరూపించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రపంచ సమయాన్ని సరిదిద్దే దిశగా తాము ముందుకు వెళ్తామని అన్నారు.
మరోవైపు పురాతన హిందూ ఖగోళ శాస్త్రం ప్రకారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ నగరాన్ని ఒకప్పుడు భారతదేశం సెంట్రల్ మెరిడియన్‌గా పరిగణించారు. దీంతో దేశంలోని సమయ మండలాలు, సమయ వ్యత్యాసాలను దీని ఆధారంగా నిర్ణయించినట్లు హిందూ క్యాలెండర్ ద్వారా తెలుస్తున్నది.
उज्जैन से तय होगा दुनिया का समय! CM मोहन यादव ने विधानसभा में रखा अपना प्लान, सुनिए क्या बोले? #Ujjain #MadhyaPradesh #MohanYadav #TimeZone | @DrMohanYadav51 pic.twitter.com/gCGrjbvRAW
— AajTak (@aajtak) December 23, 2023