న్యూఢిల్లీ: పోలీస్‌గా పేర్కొన్న ఒక వ్యక్తి (pretending to be cop) ప్రియుడ్ని కలిసిన మహిళ వీడియోను రికార్డ్ చేశాడు. ఆపై ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. షాక్ నుంచి తేరుకున్న బాధిత మహిళ వెంటనే తన ప్రియుడికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 7న ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ బయట ఉన్న కారులో ప్రియుడితో కలిసి మహిళ ఉన్నది. ఒక వ్యక్తి కారు సైడ్ మిర్రర్ నుంచి వారిద్దరి వీడియోను తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. అనంతరం కారు దిగి అపార్ట్మెంట్లోకి వెళ్లిన ఆమెను వెంబడించాడు. మెట్ల వద్ద అడ్డుకుని ప్రియుడితో కలిసి ఉన్న వీడియోను ఆ మహిళకు చూపించాడు. తాను పోలీస్ అధికారినని చెప్పిన అతడు ఆమెను బెదిరించాడు. ఆపై అక్కడ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి జారుకున్నాడు.
కాగా, ఈ షాక్ నుంచి తేరుకున్న బాధిత మహిళ వెంటనే తన ప్రియుడికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఇది తెలిసింది. దీంతో వారంతా కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ అపార్ట్మెంట్లోని సీసీటీవీ కెమెరాలు రికార్డ్ చేసిన వీడియో ఫుటేజ్‌ను పరిశీలించారు. పోలీస్ ఆఫీసర్‌గా చెప్పి మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడిన నిందితుడ్ని గుర్తించారు. అతడి ఆచూకీ తెలుసుకుని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.