Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Journalist Richa Parashar: రాహుల్ గాంధీ దురుసుగా ప్రవర్తించారు. తాను కిందపడేలా కాంగ్రెస్ ఎంపీ తోసేశాడని ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఈ ఘటన జరిగినట్లు మహిళా జర్నలిస్టు రిచా తన ఇన్‌స్టాలో తెలిపారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తనను నెట్టివేసినట్లు ఓ మహిళా ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపించింది. సుప్రీంకోర్టు వద్ద సోమవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. సర్‌లో అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ రాహుల్ తన పిటీషన్ దాఖలు చేసేందుకు సుప్రీంకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే మీడియా కవరేజీ కోసం వచ్చిన ప్రతినిధులతో రాహుల్ దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వన్ఇండియా న్యూస్ వెబ్సైట్ జర్నలిస్టు రిచా పరాశర్(Journalist Richa) తనపై దాడి జరిగినట్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. తాను మూడు నెలల గర్భిణి అని రిచా వెల్లడించారు.
రాహుల్ గాంధీ తన చేయిని లాగి కిందపడేలా చేశాడని ఆమె తన ఇన్‌స్టాలో పోస్టు చేసిన వీడియోలో చెప్పారు. తమ కెమెరామన్‌ను కూడా రాహుల్ కిందపడేలా లాగినట్లు ఆమె పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గేటు వద్ద రాహుల్ గాంధీ బైట్ కోసం ప్రయత్నించానని, ఆ సమయంలో తన మైక్‌ను రాహుల్ పక్కకు నెట్టివేశారని, అయితే ఆ తర్వాత మిగితా మీడియా సంస్థలు కూడా తమ మైక్ పెట్టడంతో ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారని, ఆ సమయంలో తన మైక్‌ను మళ్లీ రాహుల్ ముందు పెట్టేందుకు ప్రయత్నించినప్పుడు తనను తోసివేసినట్లు జర్నలిస్టు రిచా తెలిపారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిచాను బీజేపీ నేతలు కలిశారు. తాను మూడు నెలల గర్భిణి అని జర్నలిస్టు రిచా వారితో పేర్కొన్నారు. అయితే బీజేపీ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ నేత అల్కా లాంబా కొట్టిపారేశారు. జర్నలిస్టు రిచా తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు అల్కా ఆరోపించారు.
Three month pregnant Female journalist Richa Parashar was thrashed by Rahul Gandhi. https://t.co/EiZ4eqFd2V
— Ajay Sehrawat (@IamAjaySehrawat) October 13, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

