భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఓ దళితుడిపై మూత్ర విసర్జన చేసిన కేసులో నిందితుడి ప్రవీణ్ శుక్లాని పోలీసులు అరెస్టు చేశారు. ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల ప్రకారం నేషనల్ సెక్యూర్టీ యాక్ట్(National Security Act) కింద కేసు బుక్ చేశారు. ఐపీసీలోని 294, 504తో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కూడా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దళితుడిపై మూత్ర విసర్జన చేస్తున్న వీడియో వైరల్ కావడంతో శుక్లా కోసం పోలీసులు గాలించారు.
#WATCH | Sidhi viral video: Madhya Pradesh police takes accused Pravesh Shukla into custody. Earlier a case was registered against him under sections 294,504 IPC and SC/ST Act. #MadhyaPradesh pic.twitter.com/DY3hJCR64O
— ANI (@ANI) July 4, 2023
అరెస్టు నుంచి తప్పించుకునేందుకు శుక్లా తీవ్ర ప్రయత్నం చేసాడు. రాత్రంతా ఒకచోటు నుంచి మరో చోటుకు వెళ్లాడు. అయితే తెల్లవారుజామున 2 గంటలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో భాగంగా శుక్లా భార్య, పేరెంట్స్‌ను కూడా విచారించారు. 36 ఏళ్ల బాధితుడు దస్మత్ రావత్‌ను కూడా వైరల్ వీడియో గురించి పోలీసులు ప్రశ్నించారు.
#WATCH | We have taken the accused (Pravesh Shukla) into custody. He is under interrogation. Further legal action in the matter will be taken soon: Anju Lata Patle, ASP, Sidhi, Madhya Pradesh pic.twitter.com/4oHqMl2wqg
— ANI (@ANI) July 4, 2023