Crime News | బీహార్లోని వైశాలి జిల్లా కేంద్రం హజీపూర్లో పోలీసులు గురువారం ఏడు నాటు బాంబులు కనుగొన్నారు. మేహ్నగర్ ప్రాంతంలో ఈ బాంబులు దొరకడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. నాటు బాంబులు ఉన్న సంగతి తెలియగానే ఫోరెన్సిక్ నిపుణులను ఘటనా స్థలానికి రప్పించి వాటిని తొలగించామని వైశాలి జిల్లా ఎస్పీ లలిత్ మోహన్ శర్మ చెప్పారు. ఈ అంశంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై స్థానికుల స్టేట్మెంట్లను పోలీసులు నమోదు చేశారు. గతేడాది నవంబర్లో కూడా భగల్పూర్ జిల్లాలోని మధుసూదన్పూర్ ప్రాంతంలోని పశువుల కొట్టంలో నాటు బాంబుల తరహా వస్తువులు, ఏడు ఖాళీ క్యాట్రిజ్డ్లు, నాలుగు చిన్న పెట్టెలను పోలీసులు కనుగొన్నారు.