న్యూఢిల్లీ: హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వ్యక్తిని ఒక పోలీస్ అధికారి నిలువరించారు. అనంతరం ఆయన వ్యవహరించిన తీరు ఎంతో ఆకట్టుకున్నది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి తన భార్యతో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. అయితే అతడు హెల్మెట్ ధరించకపోవడాన్ని ట్రాఫిక్ విధుల్లో ఉన్న ఒక పోలీస్ అధికారి గమనించారు. వెంటనే ఆ వ్యక్తిని నిలువరించారు. అనంతరం ఒక హెల్మెట్‌ను స్వయంగా ఆ వ్యక్తి తలపై ఉంచారు. మంత్రోపదేశం చేస్తున్నట్లుగా ట్రాఫిక్ రూల్స్‌ను ఆ వ్యక్తికి వివరించారు. ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించి రోడ్డు సేఫ్టీని పాటించాలని కోరుతూ అతడికి నమస్కరించారు. ఆ వ్యక్తి కూడా ప్రతి నమస్కారం చేశాడు. అయితే ఆ ట్రాఫిక్ పోలీస్ అధికారి చివర్లో చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు. మరోసారి హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ కనిపిస్తే నిబంధనలు ఉల్లంఘించినందుకు ఐదు రెట్లు ఫైన్ వేస్తానని హెచ్చరించారు.
మరోవైపు జాకీ యాదవ్ అనే యూజర్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఈ వీడియోను ఫన్నీగా భావించారు. అలాగే హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి ఆయన చేసిన హితబోధ విధానం కూడా ఎంతో ఆకట్టుకున్నది. దీంతో ఆ పోలీస్ అధికారి వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
इस भाई को इतनी इज़्ज़त से तो शादी में सेहरा भी नहीं पहनाया गया होगा😜 pic.twitter.com/UQn1gRFypz
— Jaiky Yadav (@JaikyYadav16) September 9, 2022