విద్యార్థినితో కలిసి పారిపోయిన పోలీస్ అధికారి.. ఎక్కడంటే?
ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి ఆ పోలీస్ అధికారిపై ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లక్నో: ఒక పోలీస్ అధికారి విద్యార్థినితో కలిసి పారిపోయాడు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జోగేందర్ సింగ్ అనే పోలీస్ అధికారి, పాలియా పోలీస్ స్టేషన్లో సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒక స్కూల్ విద్యార్థినితో ఆయనకు పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెతో కలిసి షికార్లు చేసేవాడు. అయితే రెండు రోజుల కిందట ఎస్ఐ జోగేందర్ సింగ్ ఆ విద్యార్థినితో కలిసి పారిపోయాడు.
ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి ఆ పోలీస్ అధికారిపై లక్నోలో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ అధికారి, ఆ విద్యార్థిని ఎక్కడ ఉన్నారో అన్నది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, సమాచారం ఇవ్వకుండా రెండు రోజులుగా విధులకు గైర్హాజరైన ఎస్ఐ జోగేందర్ సింగ్‌పై పోలీస్ ఉన్నతాధికారులు కూడా చర్యలు చేపట్టారు. ఆయనను పోలీస్ లైన్స్‌కు అటాచ్ చేశారు.
మరోవైపు యూపీలోని కన్నౌజ్ జిల్లాలో ఒక పోలీస్ అధికారి కూడా ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు. ఆగస్ట్‌లో పోలీస్ అధికారి అనుప్ మౌర్య 17 ఏళ్ల లైంగిక దాడి బాధితురాలి తల్లిపై పోలీస్ క్వాటర్స్‌లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఉన్నతాధికారులు స్పందించారు. ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

