Police Constable | లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిన పోలీస్ కానిస్టేబుల్.. ప్రశ్నిస్తుండగా అస్వస్థతకు గురై మృతి
Police Constable | పోలీస్ కానిస్టేబుల్ (Police Constable) ముస్తాక్ అహ్మద్, శనివారం ఒక ఫిర్యాదుదారుడి నుంచి రూ.3,000లు లంచంగా తీసుకున్నాడు. దీంతో సీబీఐ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్‌లోని ప్రత్యేక గదిలో అతడ్ని ప్రశ్నించారు.
శ్రీనగర్: ఒక పోలీస్ కానిస్టేబుల్ (Police Constable ) రూ.3,000 లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఆయనను ప్రత్యేక గదిలో ప్రశ్నిస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చనిపోయాడు. జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బిల్లావర్ ప్రాంతానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ముస్తాక్ అహ్మద్, కథువాలోని మహిళా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఒక ఫిర్యాదుదారుడి నుంచి రూ.3,000లు లంచంగా తీసుకున్నాడు. దీంతో హెడ్ కానిస్టేబుల్ ముస్తాక్ అహ్మద్‌ను సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్‌లోని ప్రత్యేక గదిలో అతడ్ని ప్రశ్నించారు.
కాగా, తనకు ఛాతిలో అసౌకర్యంగా ఉందని హెడ్ కానిస్టేబుల్ ముస్తాక్ అహ్మద్ తెలిపినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కిరణ్ దేవి తెలిపారు. దీంతో ఆయనను వెంటనే ప్రభుత్వ వైద్య కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే చికిత్స పొందుతూ అక్కడ చనిపోయాడని వెల్లడించారు. కానిస్టేబుల్ ముస్తాక్ అహ్మద్ మృతికి కారణం ఏమిటన్నది తెలియలేదని అన్నారు.
Also Read:
Watch | మహిళను ఈడ్చుకొచ్చి, కొట్టి క్యాబ్లోకి నెట్టిన వ్యక్తి.. వీడియో వైరల్
strike | ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ ఉద్యోగుల సమ్మె.. అంధకారంలో గ్రామాలు, వైద్య సేవలకు అంతరాయం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

