ఛతర్పూర్: మధ్యప్రదేశ్ ఛతర్పూర్ జిల్లాలోని కేన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు లోని అక్రమాలను నిరసిస్తూ గత 15 రోజులుగా బరానా నదికి సమీపంలోని కుపీ గ్రామంలో పలు గ్రామాల ప్రజలు జరుపుతున్న నిరసనకు పోలీసులు తెరదించారు. వందలాది మంది ఆందోళనకారులను నిరసన ప్రాంతం నుంచి ఖాళీ చేయించిన పోలీసులు వారిని తమ గ్రామాలకు పంపించి వేశారు. గిరిజన మహిళ అమిత్ భట్నాగర్ జూలై 3 నుంచి ఆందోళన చేయడమే కాక, గత 11 రోజులుగా ఆమరణ నిరశన చేస్తున్నారు. గత 15 రోజులుగా వివిధ మార్గాల్లో వారు తమ నిరసనను వ్యక్తం చేశారు. కేన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఈ నిరసన జరిగింది.