KC Venugopal : కేరళ (Kerala) లోని విఝింజామ్ (Vizhinjam) అంతర్జాతీయ సీపోర్టు (International Seaport) ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) మాట్లాడుతూ.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ (Congress party) పై తీవ్ర రాజకీయ విమర్శలు చేశారు. చాలా మందికి నిద్ర లేకుండా చేస్తానని హెచ్చరించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ధీటుగా స్పందించింది. నిద్రలేని రాత్రులు ఇండియా బ్లాక్ (India Bloc) నాయకులకు కాదని, ప్రధాని నరేంద్ర మోదీకేనని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ (KC Vinugopal) అన్నారు.
‘మేం ప్రశాంతంగా నిద్రపోతాం. నిద్రపోవడం ప్రధాని మోదీకి కష్టతరం కానుంది.’ అని వేణుగోపాల్ చెప్పారు. జనగణన అమలు, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు కోసం తాము కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పెంచుతామని అన్నారు. ‘పీఎం ఏ ఉద్దేశంతో చాలా మందికి నిద్రలేకుండా చేస్తానని అన్నారో నాకు తెలియదు. కానీ నిద్రలేని రాత్రులు గడిపే వాళ్లలో పీఎం కూడా ఒకరు. అందులో ఇండియా బ్లాక్ గానీ, రాహుల్‌గాంధీ గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ ఉండదు.’ అని వ్యాఖ్యానించారు.