న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఇవాళ తన రాజకీయ జీవితంలో కీలక మైలురాయి అందుకున్నారు. ప్రభుత్వాధినేతగా ఆయన 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఓ ప్రభుత్వానికి అధినేత హోదాలో ఆయన 25 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. అక్టోబర్ 7, 2025 నాటికి తన పరిపాలన 25 ఏళ్లకు చేరుకున్నట్లు ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నారు. ఇదే రోజున 2001లో గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. దేశ ప్రజల జీవితాలను బలోపేతం చేసేందుకు, దేశ ఉజ్వల ప్రగతి కోసం ఆ నాటి నుంచి శ్రమిస్తున్నట్లు చెప్పారు.
On this day in 2001, I took oath as Gujarat’s Chief Minister for the first time. Thanks to the continuous blessings of my fellow Indians, I am entering my 25th year of serving as the head of a Government. My gratitude to the people of India. Through all these years, it has been… pic.twitter.com/21qoOAEC3E
— Narendra Modi (@narendramodi) October 7, 2025
చాలా విపత్కర పరిస్థితుల్లో ఉన్న గుజరాత్‌కు తనను సీఎంగా చేశారని, ఆ బాధ్యతలను తనకు పార్టీ అప్పగించినట్లు గుర్తు చేశారు. భారీ భూకంపం, సూపర్ సైక్లోన్, వరుస కరవులతో సతమతం అవుతున్న గుజరాత్‌ను తన చేతుల్లో పెట్టారన్నారు. ఇక 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధానిగా దేశానికి సేవ చేస్తున్నట్లు మోదీ తన ఎక్స్ అకౌంట్లో తెలిపారు. తన ట్వీట్స్‌లో వివిధ అనుభవాలను గుర్తు చేశారు.
In 2013, I was given the responsibility of being the Prime Ministerial candidate for the 2014 Lok Sabha elections. Those days, the nation was witnessing a crisis of trust and governance. The then UPA Government was synonymous with the worst form of corruption, cronyism and policy… pic.twitter.com/zoamKs4ECP
— Narendra Modi (@narendramodi) October 7, 2025