పాట్నా: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పాట్నాలోని తాకత్ శ్రీ హరిమందర్ జీ పట్నా సాహిబ్ గురుద్వారాను విజిట్ చేశారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 18వ శతాబ్ధంలో మహారాజా రంజిత్ సింగ్ .. తాకత్ శ్రీ హరిమందర్ జీ గురుద్వారాను నిర్మించారు. గురుగోబింద్ పుట్టిన ఊరు ఇదే. సిక్కు గురువుల్లో ఈయన పదో వ్యక్తి. పాట్నాలో ఆయన 1666లో జన్మించారు. గురుగోబింద్ తన తొలి రోజులను ఇక్కగే గడిపారు. ఆ తర్వాత ఆయన ఆనంద్‌పుర్ సాహిబ్‌కు వెళ్లారు. పట్నా సాహిబ్ గురుద్వారాలో మోదీ ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ఆయన వంటశాలకు వెళ్లారు. ఆ తర్వాత లంగర్ సర్వ్ చేశారు.