అహ్మదాబాద్: మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీ తయారీ ప్లాంట్ను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఇవాళ ప్రారంభించారు. హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్లను ఆ ప్లాంట్లో ఉత్పత్తి చేయనున్నారు. ఇక మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం ఈ-విటారాను కూడా అక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. జపాన్, యురోప్తో పాటు సుమారు వంద దేశాలకు ఈ కార్లను ఎగుమతి చేయనున్నారు. హన్సల్పూర్లో ఉన్న సుజుకీ మోటార్ ప్లాంట్లో తయారీ అయిన ఈ-విటారా కారును మోదీ ఆవిష్కరించారు. ఆ కార్యక్రమంలో సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రతినిధి, ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ పాల్గొన్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా హాజరయ్యారు.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi and Toshihiro Suzuki, President & Representative Director of Suzuki Motor Corporation, flagged off the ‘e-VITARA’, Suzuki’s first global strategic Battery Electric Vehicle (BEV), at the Suzuki Motor plant in Hansalpur, Ahmedabad.… pic.twitter.com/LPKWBjdykN
— ANI (@ANI) August 26, 2025