న్యూఢిల్లీ: వైమానిక దళానికి చెందిన C-130J జంబో విమానంలో మోదీ విహరించనున్నారు. ఆ విమానం రేపు పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్ కానున్నది. ఉత్తరప్రదేశ్‌లోని 340 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేను రేపు ప్రారంభించనున్నారు. ఆ ప్రారంభోత్సవానికి మోదీ జంబో విమానంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ హైవేపై వైమానిక దళ విమానాలు ల్యాండింగ్ రిహార్సల్స్ చేస్తున్న వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుల్తాన్పూర్ జిల్లాలో ఉన్న సిమెంట్ ఎయిర్‌స్ట్రిప్‌పై సీ-130జే సూపర్ హెర్క్యూల్స్ రేపు ల్యాండ్ అవుతుందని భావిస్తున్నారు. మిరాజ్ 200, ఏఎన్-32 టర్బోప్రాప్, సుఖోయ్-30 విమానాలు ఇప్పటికే పూర్వాంచల్ హైవేపై విన్యాసాలు నిర్వహిస్తున్నాయి.