న్యూఢిల్లీ: ప్రధాని మోదీ వాట్సాప్ ఛానల్(WhatsApp Channel) రికార్డు క్రియేట్ చేసింది. కేవలం వారం రోజుల్లోనే ప్రధాని మోదీని.. వాట్సాప్ ఛానల్లో 50 లక్షల మంది ఫాలో అయ్యారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్లకు ఆయన థ్యాంక్స్ తెలిపారు. ప్రపంచదేశాల నేతల్లో.. మోదీ వాట్సాప్ ఛానల్ను చాలా మంది ఫాలో అవుతున్నారు. చాలా వేగంగా, అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. యువత ఇస్తున్న సపోర్టును ఆహ్వానిస్తున్నానని, ఈ వేదిక ద్వారా విభిన్న అంశాలపై కనెక్ట్ అవుదామని ఆయన అన్నారు. మోదీ వాట్సాప్ ఛానల్ను లాంచ్ చేసిన తొలి రోజే సుమారు పది లక్షల మంది దాంట్లో చేరారు.