Narendra Modi : యూరప్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi ) స్లోవేకియా చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినితో చర్చలు జరిపేందుకు మోడీ సోమవారం రాజధాని బ్రటిస్లవలో అడుగుపెట్టా రు. వాణిజ్యం, సాంకేతికతలో పరస్పర సహకారం, పెట్టుబడులే లక్ష్యంగా మోడీ, పీటర్ నడుమ చర్చలు సాగనున్నాయి.
యూరప్‌లోని మూడు దేశాల పర్యటించేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం స్లోవేకియాలో అడుగుపెట్టారు. రాజధాని బ్రటిస్లవా చేరుకున్న మోడీ అక్కడ రెండు రోజులు బస చేయనున్నారు. అధ్యక్షుడు పీటర్ పిల్లెగ్రినితో పాటు ప్రధాని రాబర్ట్ ఫికోతో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. స్లోవేకియా వ్యాపారవేత్తలతో సమావేశమై.. ఇరుదేశాల మద్య ఆర్ధిక సంబంధాల విస్తరణ అవకాశాలను మోడీ ప్రస్తావించనున్నారు.
Reached Bratislava.
This visit provides an opportunity to deepen India-Slovakia relations and explore new avenues of cooperation.
Looking forward to productive meetings with President Pellegrini and Prime Minister Fico.@PellegriniP_@RobertFicoSVK
— Narendra Modi (@narendramodi) June 14, 2026
తన పర్యటనతో భారత్ – స్లోవేకియా సంబంధాలు మెరుగవుతాయని ప్రధాని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘రాజధాని బ్రటిస్లవా చేరుకున్నా. భారత్ – స్లోవేకియా మధ్య సంబంధాల బలోపేతానికి, కొత్త వ్యాపారాలు, సహకారం వంటివి సాధ్యపడేందుకు ఈ పర్యటన దోహదపడనుంది. అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని, ప్రధాని పికోతో ఫలవంత మైన చర్చలు జరపాలని భావిస్తున్నా’ అని ప్రధాని మోడీ ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించారు. స్లోవేకియాకు 1993లో స్వాతంత్రం వచ్చాక ఆ దేశానికి వెళ్లిన మొదటి భారత ప్రధాని మోడీనే కావడం విశేషం.
The team of Lucnica Ensemble sang Vande Mataram during the welcome in Bratislava.
This comes at a time when we are marking 150 years of Vande Mataram and recalling its glorious contribution to India’s history and freedom struggle. pic.twitter.com/loVBUzG5oo
— Narendra Modi (@narendramodi) June 15, 2026