మధురై: తమిళనాడులోని మధురైలో ఉన్న మీనాక్షి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. గురువారం రాత్రి ఆయన ఆలయాన్ని విజిట్ చేశారు. మీనాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తమిళ సాంప్రదాయమైన వేస్తి దుస్తుల్లో మోదీ ఆలయానికి వెళ్లారు. పూజలు పూర్ణకుంబంతో మోదీకి స్వాగతం పలికారు. తెల్ల షర్ట్, ధోతి ధరించిన మోదీ ఆలయంలో కాసేపు గడిపారు. ఆలయానికి వెళ్తున్న సమయంలో ప్రజలు ఆయనకు గ్రాండ్గా వెల్కమ్ పలికారు. 2019లోనూ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ .. చెన్నైలో టూర్ చేసినప్పుడు ప్రధాని మోదీ తమిళ సాంప్రదాయ దుస్తులను ధరించిన విషయం తెలిసిందే. ఇవాళ మధురైలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొననున్నారు. సీఎం పళనిస్వామి కూడా ఆ సభలో పాల్గొంటారు. కన్యాకుమారిలో జరిగే సభలోనూ మోదీ మాట్లాడనున్నారు. కన్యాకుమారి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నది. అక్కడ మాజీ కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు.
Prayed at the Madurai Meenakshi Amman Temple. pic.twitter.com/ZUDRIZavDH
— Narendra Modi (@narendramodi) April 1, 2021