ముంబై: ఓ అమ్మాయి రాసిన సూసైడ్ నోట్(Suicide Note)పై ప్రధాని మోదీ జోకేశారు. ఆ జోక్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ వేసింది జోక్ కాదు అని, అది విషాదభరితమైన అంశమని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ విమర్శించారు. బుధవారం ఓ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. చిన్ననాటి జోక్‌ను గుర్తు చేశారు. ఓ ప్రొఫెసర్ కూతురు సూసైడ్ నోట్ రాసిందని, దాంట్లో ఆమె కాంకరియా నదిలో దూకి చావనున్నట్లు పేర్కొంటుందని, అయితే ఆ సూసైడ్ నోట్ చూసిన ప్రొఫెసర్, దాంట్లో కాంకరియా పేరును తన కూతురు తప్పు రాసినట్లు ఆగ్రహానికి గురువుతాడని ప్రధాని అన్నారు. ఈ జోక్ వేయగానే ఆ సదస్సులో ఉన్న అందరూ ఒక్కసారిగా నవ్వారు. అయితే విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రధాని మోదీ జోక్ వేసిన తీరు ఆక్షేపణీయంగా ఉందని విమర్శలు వస్తున్నాయి.
ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోను తన ట్విట్టర్లో పోస్టు చేసిన ప్రియాంకా గాంధీ.. సున్నితమైన విషయాల్లో ప్రధాని ప్రదర్శించిన వైఖరిని ఆమె తప్పుపట్టారు. యువతలో డిప్రెషన్, సూసైడ్ అంశాలు నవ్వుకునే విషయం కాదన్నారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం.. 2021లో లక్షా 64 వేల మంది సూసైడ్ చేసుకున్నారని, దాంట్లో ఎక్కువ శాతం మంది 30 ఏళ్ల లోపువారే అని, ఇది విషాదమని, జోక్ కాదు అని ప్రియాంకా అన్నారు.
Depression and suicide, especially among the youth IS NOT a laughing matter.
According to NCRB data, 164033 Indians committed suicide in 2021. Of which a huge percentage were below the age of 30. This is a tragedy not a joke.
The Prime Minister and those laughing heartily at… pic.twitter.com/yoPt5c8Kx7
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 27, 2023
సూసైడ్‌పై జోకేసిన తర్వాత ప్రధాని మోదీ.. జర్నలిస్టు అర్నబ్ గోస్వామిపై కూడా జోకేశారు. ఇప్పుడు అర్నబ్ హిందూలో మాట్లాడుతున్నారని, స్పష్టమైన భాష మాట్లాడుతున్నాడని, ముంబైలో ఉండడం వల్ల అతనికి హిందీ వచ్చినట్లు మోదీ నవ్వించారు. కానీ విద్యార్థుల ఆత్మహత్యలపై మోదీ జోకేసిన తీరు అందర్నీ కలిచివేసింది. ప్రతిపక్షాలకు చెందిన నేతలు ఆ జోక్‌ను ఖండించారు.
Respected PM,
I won’t share the triggering video where you cracked a joke on suicide while the audience laughed at the insensitive ‘joke’, however I’d definitely like to remind you that 2021 NCRB data shows that over 1.5 lakh Indians committed suicide, also deaths by suicide… pic.twitter.com/nWysoJSIRL
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) April 27, 2023