వందే భారత్ రైలుకు ప్రధాని మోదీ 17వ సారి జెండా ఊపారు. పూరీ-హౌరా మార్గంలో ఈ నెల 20 నుంచి నడిచే వందే భారత్ రైలును ఆయన గురువారం లాంఛనంగా పూరీలో ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. రూ.8200 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపన చేశారు. ఒడిశాలో 100 శాతం విద్యుద్దీకరణ చేసిన రైల్వే నెట్వర్క్ను జాతికి అంకితం చేశారు. పూరీ-హౌరా రైలు గురువారం తప్ప వారంలో మిగతా అన్ని రోజుల్లో నడవనుంది. 500 కి.మీల దూరాన్ని 6.5 గంటల్లో చేరుకునే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ మార్గంలో వేగవంతమైన రైలని అధికారులు తెలిపారు.