PM Modi Degree | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎంపీ సంజయ్ సింగ్‌కు సమన్లు..!
PM Modi Degree | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత సంజయ్ సింగ్‌లకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. పరువు నష్టం కేసులో నోటీసులు జారీ అయ్యాయి. ప్రధాని మోదీ డిగ్రీ విషయంలో కేజ్రీవాల్, సంజయ్ సింగ్ అవమానకర ప్రకటనలు చేశారంటూ గుజరాత్ యూనివర్సిటీ ఆరోపించింది.
PM Modi Degree | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత సంజయ్ సింగ్‌లకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. పరువు నష్టం కేసులో నోటీసులు జారీ అయ్యాయి. ప్రధాని మోదీ డిగ్రీ విషయంలో కేజ్రీవాల్, సంజయ్ సింగ్ అవమానకర ప్రకటనలు చేశారంటూ గుజరాత్ యూనివర్సిటీ ఆరోపించింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 500 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ విలేకరుల సమావేశంలో, ట్విట్టర్ హ్యాండిల్లో యూనివర్సిటీపై అవమానకర వ్యాఖ్యలు చేశారని యూనివర్సిటీ పేర్కొంది. దాంతో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థ ప్రతిష్ట దెబ్బతిందని ఆరోపించింది.
ఈ మేరకు అహ్మదాబాద్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జయేష్‌భాయ్ చౌవాటియా కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌లకు సమన్లు జారీ చేశారు. మే 23న విచారణకు హాజరుకావాలని సూచించారు. గుజరాత్ విశ్వవిద్యాలయం 70 సంవత్సరాల కిందట స్థాపించారని, ప్రజల్లో మంచి పేరుందని, ఇలాంటి ఆరోపణలతో యూనివర్సిటీపై ప్రజల్లో విశ్వసనీయత దెబ్బతింటోందని గుజరాత్ యూనివర్సిటీ తరఫు న్యాయవాది తెలిపారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హత విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన విషయంతో తెలిసిందే. ఈ విషయంలో ఆయనకు గుజరాత్ హైకోర్టు సైతం జరిమానా విధించింది. అయితే, కోర్టు ఇచ్చిన తీర్పు అనుమానాలను మరింత పెంచిందని పేర్కొన్నారు.
మోదీ చదువుకున్నట్లయితే నోట్ల రద్దు వంటి నిర్ణయాలు తీసుకోరని ఎద్దేవా చేశారు. మోదీకి సరైన డిగ్రీ ఉంటే గుజరాత్ యూనివర్సిటీ ఎందుకు చూపించడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మోదీ డిగ్రీ నకిలీదైనా అయి ఉండాలని.. లేదంటే మోదీకి భయపడి గుజరాత్ యూనివర్సిటీ సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. గుజరాత్ యూనివర్సిటీలో ప్రధాని చదివి ఉంటే మన విద్యార్థి దేశానికి ప్రధాని అయ్యాడని గుజరాత్ యూనివర్సిటీ సంబరాలు చేసుకోవాలన్నారు. ప్రధాని ఫేక్ డిగ్రీని అసలైనదిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో యూనివర్సిటీ ఫేక్ డిగ్రీలను ఇస్తుందనే సందేశాన్ని పంపినట్లుగా నేతల వ్యాఖ్యలు ఉన్నాయని గుజరాత్ యూనివర్సిటీ తరఫు న్యాయవాది ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

