PM Modi : జపాన్ (Japan) నూతన ప్రధాని (New Prime Minister) గా ఎన్నికై తొలి మహిళా ప్రధాని (First female PM) గా గుర్తింపు దక్కించుకున్న సనే తకాయిచి (Sanae Takaichi) కి ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రధాని ఒక పోస్టు పెట్టారు.
భారత్-జపాన్ల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం తకాయిచితో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అదేవిధంగా ఈ ప్రాంతానికి వెలుపల శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుల విషయంలో ఇరుదేశాల బంధాలు కీలకపాత్ర పోషిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
‘జపాన్‌కు నూతన ప్రధానిగా ఎన్నికైన మీకు హృదయపూర్వక అభినందనలు సనే తకాయిచి. భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అదేవిధంగా ఈ ప్రాంతానికి వెలుపల శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుల నెలకొనడంలో ఇరుదేశాల బంధం కీలకపాత్ర పోషిస్తుంది’ అని పేర్కొన్నారు.