PM Modi | నా మిత్రుడికి అభినందనలు.. ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
PM Modi | డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అభినందనలు తెలిపారు. చరిత్రాత్మక విజయం పొందిన నా మిత్రుడికి హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.
PM Modi | అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలన్నీ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు అనుకూలంగానే ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ మార్కు 270. తాజా ట్రెండ్ ప్రకారం.. ట్రంప్ మెజారిటీ మార్క్ 270 ఓట్లను సాధించారు. దీంతో ట్రంప్‌నకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం డొనాల్డ్ ట్రంప్‌కు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. చరిత్రాత్మక విజయం పొందిన నా మిత్రుడికి హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.
‘చరిత్రాత్మక ఎన్నికల విజయం సాధించిన నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు. మీ మునుపటి పదవీకాల విజయాలకు అనుగుణంగా.. భారత్ – అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మన సంబంధాలకు పునరుజ్జీవం కల్పించడానికి నేను ఎదురుచూస్తున్నాను. ప్రజల అభివృద్ధి, శ్రేయస్సు, ప్రపంచ శాంతి, సుస్థిరత్వం కోసం కలిసి పనిచేద్దాం’ అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కు గతంలో పలు వేదికల్లో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను మోదీ పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
Heartiest congratulations my friend @realDonaldTrump on your historic election victory. As you build on the successes of your previous term, I look forward to renewing our collaboration to further strengthen the India-US Comprehensive Global and Strategic Partnership. Together,… pic.twitter.com/u5hKPeJ3SY
— Narendra Modi (@narendramodi) November 6, 2024
అమెరికా చరిత్రలో ఇది స్వర్ణయుగం : ట్రంప్
మరోవైపు ఎన్నికల ఫలితాలపై ట్రంప్ స్పందించారు. ఈ మేరకు ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. తన గెలుపు రాజకీయ విక్టరీ అని పేర్కొన్నారు. అసాధారణ, శక్తివంతమైన తీర్పును అమెరికా ప్రజలు అందించినట్లు ట్రంప్ తెలిపారు. తమ జీవితాల్లో ఇదో ముఖ్యమైన రోజు అని ఓటర్లు భావిస్తారని ఆయన చెప్పారు. అమెరికా చరిత్రలో ఇది స్వర్ణయుగం కాబోతుందన్నారు. ఈ అత్యద్భుత విజయం అమెరికా ప్రజలకు చెందుతుందని, దీంతో అమెరికాను మరోసారి మళ్లీ ఉన్నతంగా నిలిపే అవకాశం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. సేనేట్లోనూ తమ పార్టీ విజయం సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి జరిగిన గాయాలకు చికిత్స చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. బోర్డర్ సమస్యలను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు.
Also Read..
Donald Trump | ట్రంప్‌కు అనుకూలంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. భారత్‌కు మేలు చేకూరేనా..?
Kamala Harris | ఓటమి నేపథ్యంలో.. ఎలక్షన్ నైట్ ప్రసంగాన్ని రద్దు చేసుకున్న కమలా హారిస్
Donald Trump | విజయం దిశగా ట్రంప్.. సెలబ్రేషన్స్ మూడ్‌లో మద్దతుదారులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

