PM Modi : కిర్గిస్తాన్‌లో జరుగుతున్న ఎస్సీవో సదస్సులో అరుదైన భేటీ జరిగింది. చాలా కాలం తర్వాత ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయ్యారు. ముగ్గురూ ఒకేసారి వేదికపై చేరి, ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు. ముగ్గురూ కొద్దిసేపు సంభాషించుకున్నారు. కిర్గిస్తాన్‌లోని బిష్కెక్లో 26వ ఎస్సీవో సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో వివిధ దేశాధినేతలు పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా మోదీ, పుతిన్, జిన్‌పింగ్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెలలోనే మోదీ, జిన్‌పింగ్ మరోసారి భేటీ కానుండటం విశేషం. ఈ నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు జిన్‌పింగ్ హాజరుకానున్నారు. దీంతో మరోసారి మోదీ, జిన్‌పింగ్ భేటీ కావడం ఖాయం. ఈ పర్యటన సందర్భంగా ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఇక, ఎస్సీవో సదస్సులో మోదీ మాట్లాడారు. పక్కనే ఉన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ముందే తీవ్రవాదం గురించి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
The Indian Aura Enters the SCO!
PM @narendramodi joins SCO leaders in Bishkek, putting the spotlight on India’s three key priorities for the SCO: Security, Connectivity and opportunity. #SCOSummit2026#PMModiInKyrgyzstan pic.twitter.com/WOTjAUxyE6
— MyGovIndia (@mygovindia) September 1, 2026
తీవ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని మోదీ అన్నారు. తీవ్రవాదాన్ని అన్ని రూపాల్లో అణిచివేయాలని, తీవ్రవాదులకు నిధులు అందించడం, నియామాకాలు చేపట్టడం, ఉగ్రవాదంవైపు ప్రజల్ని నడిపించడం వంటివి ఆపేయాలని సూచించారు. యుద్ధాలతో సమస్య పరిష్కారం కాదని, ద్వైపాక్షిక చర్చలు, రాయబారం వల్లే సమస్యలు పరిష్కారమవుతాయని మోదీ అన్నారు. అంతకుముందు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌తో యుద్ధం గురించి పుతిన్‌తో చర్చించినట్లు చెప్పారు.
ఈ ప్రాంతంలో శాంతి కోసం జరిగే ప్రయత్నాల్లో ఇండియా ముందుంటుందని మోదీ అన్నారు. అంతులేని యుద్ధాల నుంచి బయటకు రావాలని సూచించారు. శాంతియుత మార్గం ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కారించుకోవడమే మానవాళి పిలుపు అనేది భారత సందేశం అని మోదీ పేర్కొన్నారు.