ప్రజాస్వామ్యాన్ని కాపాడండి… సీజేఐని కోరిన మమతా బెనర్జీ
సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గం ప్రజాస్వామిక అధికారాన్ని స్వాధీనం చేసుకుంటుందంటూ పరోక్షంగా బీజేపీపై మమతా బెనర్జీ మండిపడ్డారు.
కోల్‌కతా: కేంద్రంలోని బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య సంస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యూయూ లలిత్‌ను కోరారు. కోల్‌కతాలోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్ (ఎన్‌యూజేఎస్) స్నాతకోత్సవ వేడుకకు సీజేఐ లలిత్ వీసీగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం మమతా బెనర్జీ ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజలను వేధింపుల నుంచి రక్షించాలని న్యాయవ్యవస్థను కోరారు.
సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గం ప్రజాస్వామిక అధికారాన్ని స్వాధీనం చేసుకుంటుందంటూ పరోక్షంగా బీజేపీపై మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? దయచేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’ అని సీజేఐని ఉద్దేశించి అన్నారు. ప్రజాస్వామ్య సంస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ధోరణి కొనసాగితే దేశమంతా రాష్ట్రపతి పాలనకు దారి తీస్తుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య నిర్మాణాన్ని పరిరక్షించాలని సీజేఐ జస్టిస్ లలిత్‌ను ఆమె కోరారు.
కాగా, మీడియా కూడా పక్షపాతంతో వ్యవహరిస్తున్నదని సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. వారు ఎవరినైనా నిందిస్తారా అని ప్రశ్నించారు. మన ప్రతిష్టకు భంగం కలిగితే ఇక అంతేగా అని అన్నారు. తీర్పు వెలువడకముందే చాలా విషయాలు జరుగుతున్నాయని విమర్శించారు. తాను తప్పు మాట్లాడితే క్షమాపణలు కోరుతున్నానని ఆమె అన్నారు.
అలాగే న్యాయవ్యవస్థ పరిస్థితి మరింత దిగజారిందని మమతా బెనర్జీ విమర్శించారు. ‘ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోయారని నేను చెప్పడం లేదు, కానీ ఈ రోజుల్లో పరిస్థితి మరింత దిగజారింది. అన్యాయం నుంచి ప్రజలను న్యాయవ్యవస్థ రక్షించాలి. వారి మొరను వినాలి. ప్రస్తుతం ప్రజలు తలుపుల వెనుక ఏడుస్తున్నారు’ అని ఆమె వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SIR | తెలంగాణలో ఓట్ల తొలగింపు కలకలం.. 5.84 లక్షల ఫామ్-7 దరఖాస్తులు.. అసలేం జరుగుతోంది?
Alphabet Shares | రూ.45.76 లక్షల కోట్లు ఫట్… ఒక్కరోజే భారీగా కరిగిపోయిన గూగుల్ విలువ
Crypto Heist | క్రిప్టో చరిత్రలోనే అతిపెద్ద చోరీ.. 20 నిమిషాల్లో రూ.52వేల కోట్ల క్రిప్టో కరెన్సీ మాయం!!
Water Management | నీటి వృథాను అరికడితేనే.. కరువు నుంచి రక్షణ.. ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ బీవీ సుబ్బారావు
Krishna River | రోజుకో టీఎంసీ.. శ్రీశైలం నుంచి 79 రోజుల్లో 72 టీఎంసీలు ఎత్తిపోసిన ఏపీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

