న్యూఢిల్లీ: పోర్చుగల్‌లోని బేజా విమానాశ్రయం వద్ద ఆదివారం జరిగిన ఎయిర్ షోలో రెండు చిన్న విమానాలు ఢీకొన్నాయి. ఆకాశంలో ఎగురుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోగా, మరొక పైలట్ గాయపడ్డారు. ఆరు విమానాలు విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ఎయిర్ షోకు అంతరాయం ఏర్పడింది. ఈ విన్యాసాల్లో పదుల సంఖ్యలో సైనిక విమానాలు, హెలికాప్టర్లు పాల్గొన్నాయి. ప్రమాదానికి గురైన విమానాలు యాక్ స్టార్స్ ఏరోబేటిక్ పెట్రోల్‌కు చెందినవని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.