లీటరు పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెంపు
న్యూఢిల్లీ: ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. శనివారం లీటరు పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు రికార్డుస్థాయికి చేరాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.102.14కు చేరుకోగా.. ముంబైలో 108.19కి ఎగబాకింది. అలాగే లీటరు డీజిల్ ధర ఢిల్లీలో రూ.90.47కి పెరుగగా.. ముంబైలో రూ.98.16కి చేరుకుంది. కేవలం వారం వ్యవధిలో నాలుగుసార్లు పెట్రోల్ ధరలు పెరుగగా.. తొమ్మిది రోజుల్లో ఏడుసార్లు డీజిల్ ధరలు పెరిగాయి.