Kerala | రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో కేంద్రం జోక్యం.. ‘సుప్రీం’లో కేరళ సర్కారు పిటిషన్
రుణాలపై పరిమితి విధించడం వంటి చర్యల ద్వారా రాష్ర్టానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొంటున్నదని ఆరోపిస్తూ కేరళ సర్కార్ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ వేసింది.
- సుప్రీంకోర్టులో కేరళ ప్రభుత్వం పిటిషన్
న్యూఢిల్లీ, డిసెంబర్ 13: రుణాలపై పరిమితి విధించడం వంటి చర్యల ద్వారా రాష్ర్టానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొంటున్నదని ఆరోపిస్తూ కేరళ సర్కార్ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ వేసింది. రాజ్యాంగంలోని పలు నిబంధనల ప్రకారం సొంత ఆర్థిక వ్యవహారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయని, అయితే ఈ అధికారాల్లో జోక్యం చేసుకొనేందుకు కేంద్రానికి ఎలాంటి అధికారం ఉన్నదనే ప్రశ్నలు లేవనెత్తింది. కేంద్ర ఆర్థిక శాఖ 2023 మార్చిలో జారీచేసిన లేఖలు, ఎఫ్ఆర్బీఎం చట్టంలోని సెక్షన్ 4కు సవరణలు చేయడం ద్వారా నికర రుణ పరిమితి విధించడం, నికర రుణ పరిమితిని తగ్గించడం వంటి చర్యలతో రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకొన్నదని కేరళ ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొన్నది.
రుణాలు, బడ్జెట్ తయారీ, నిర్వహణ ద్వారా తన ఆర్థిక వ్యవహారాల నియంత్రణకు రాష్ర్టాలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయని పేర్కొన్నది. రుణాల పరిమితిని తగ్గించడం వల్ల రాష్ర్టాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. ‘రాష్ట్ర ప్రభుత్వ అప్పు’ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 కింద ఏడో షెడ్యూల్లోని రాష్ర్టాల జాబితాలో ఉన్నదని, అయితే కేంద్ర ప్రభుత్వం అసంబద్ధ సవరణల ద్వారా రాష్ర్టాల అధికారాల్లోకి చొరబడిందని ఆరోపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

