అక్టోబర్‌కల్లా మరో ఐదు టీకాలకు కూడా?
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: కరోనా టీకాలకు కొరత నేపథ్యంలో మరిన్ని వ్యాక్సిన్లను అందుబాటులోకి తేవడానికి కేంద్రం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వీ టీకాకు 10 రోజుల్లో అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అక్టోబర్ నాటికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలతో పాటు మరో ఐదు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఐదు టీకాల్లో భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న ముక్కు నుంచే వేసే టీకా కూడా ఉన్నది. ఇది అక్టోబర్‌లో అందుబాటులోకి వస్తుందని సమాచారం. మరో మూడు టీకాలు.. జాన్సన్ అండ్ జాన్సన్ , నోవావాక్స్, జైడస్ క్యాడిలా.