‘రోడ్లు బాగోలేక మాకు పెళ్లిళ్లు జరుగడం లేదు’.. యువతి లేఖపై సీఎంవోలో కదలిక

బెంగళూరు: తమ గ్రామంలో రోడ్లు బాగోలేక స్థానికులకు వివాహాలు జరుగడం లేదంటూ ఒక యువతి సీఎం కార్యాలయానికి లేఖ రాసింది. ఇది అధికారుల్లో కదలిక తెచ్చింది. కర్ణాటకలోని దవంగెరె జిల్లాలోని హెచ్ రాంపురా గ్రామంలో రోడ్లు దారుణంగా ఉన్నాయి. దీంతో గ్రామానికి చెందిన 26 ఏండ్ల ఉపాధ్యాయురాలు బిందు దీనిపై ఆ రాష్ట్ర సీఎం కార్యాలయానికి ఒక లేఖ రాశారు. ‘మా గ్రామానికి సరైన రోడ్ కనెక్టివిటీ లేదు. ఈ గ్రామం ఇంకా వెనుకబడి ఉంది. దీని వల్ల మాలో చాలా మందికి వివాహాలు కావడం లేదు. ఎందుకంటే, గ్రామంలో సరైన రోడ్లు లేకపోవడం వల్ల పిల్లలు ఇక్కడ విద్యను పొందలేరని బయటి వ్యక్తులు భావిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో రోడ్డు పనులు చేపట్టండి’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, బిందు లేఖపై కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) స్పందించింది. ఈ సమస్యను తొందరలో పరిష్కరిస్తామని ఒక అధికారి భరోసా ఇచ్చారు. తక్షణమే పనులు చేపట్టాలని, జరుగుతున్న పనుల గురించి తెలియజేయాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖను సీఎం కార్యాలయం ఆదేశించింది.
మరోవైపు ఈ గ్రామంలోని రోడ్డు అభివృద్ధి కోసం ఇప్పటికే సుమారు రెండు లక్షల వరకు ఖర్చు చేసినట్లు మాయకొండ పంచాయతీ అభివృద్ధి అధికారి ఎం సిద్దప్ప తెలిపారు. అయితే ఈ నిధులు సరిపోవని తారు రోడ్డు వేసేందుకు రూ.50 లక్షల నుంచి కోటి వరకు వ్యయం అవుతుందని అన్నారు. ఈ మేరకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేను కోరినట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమె ఇంటికి నిప్పంటించిన వ్యక్తి
CM Revanth Reddy | బర్లు కాసుకునేవాళ్లు కాళేశ్వరం దగ్గర సెల్ఫీలు దిగుతున్నరు : సీఎం రేవంత్ రెడ్డి
Sheraz Mehdi | ‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు థియేటర్లు దక్కడం లేదని ఆవేదన.. ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసిన షెరాజ్ మెహదీ
Srimathi trailer | భావోద్వేగాలతో కూడిన బలమైన సందేశం.. తిరువీర్, నివేదా థామస్ ‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల
జూలూరుపాడులో పోలీసుల నాకాబందీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

