Peeing incident in Bus| మద్యం మత్తులో బస్సులోని మహిళా ప్రయాణికురాలి సీటుపై.. మూత్ర విసర్జన చేసిన వ్యక్తి
Peeing incident in Bus| డిన్నర్ తర్వాత బస్సు ఎక్కిన ఆ యువతి తన సీటు తడిగా ఉండటాన్ని గమనించింది. పక్క సీటులోని వ్యక్తి మూత్ర విసర్జన చేసినట్లు గ్రహించింది. బస్సు డ్రైవర్, కండక్టర్‌కు దీని గురించి చెప్పింది. దీంతో వారు ఆ వ్యక్తిని నిలదీశారు.
బెంగళూరు: విమానాల్లో ప్రయాణించిన మహిళా ప్రయాణికుల సీట్లపై మూత్ర విసర్జన సంఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఒక ఆర్టీసీ బస్సు (Peeing incident in Bus) లో ఇలాంటి సంఘటన జరిగింది. ఒక వ్యక్తి మద్యం మత్తులో మహిళా ప్రయాణికురాలి సీటుపై మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఆ మహిళ దీని గురించి బస్సు డ్రైవర్, కండక్టర్‌కు ఫిర్యాదు చేసింది. కర్ణాటకలోని హుబ్బళ్లి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ)కి చెందిన ఏసీ స్లీపర్ బస్సు విజయపుర నుంచి మంగళూరు బయలుదేరింది. అయితే డిన్నర్ కోసం కిరేసూరు సమీపంలోని ఒక దాబా వద్ద ఆ బస్సును ఆపారు. దీంతో బస్సులోని వారంతా భోజనం కోసం కిందకు దిగారు.
కాగా, ఆ బస్సులో ప్రయాణించిన 20 ఏళ్ల యువతి కూడా డిన్నర్ కోసం బస్సు దిగింది. అయితే ఆమె పక్క సీటులో ప్రయాణించిన 30 ఏళ్ల వ్యక్తి మద్యం మత్తులో ఆమె సీటుపై మూత్ర విసర్జన చేశాడు. డిన్నర్ తర్వాత బస్సు ఎక్కిన ఆ యువతి తన సీటు తడిగా ఉండటాన్ని గమనించింది. పక్క సీటులోని వ్యక్తి మూత్ర విసర్జన చేసినట్లు గ్రహించింది. బస్సు డ్రైవర్, కండక్టర్‌కు దీని గురించి చెప్పింది. దీంతో వారు ఆ వ్యక్తిని నిలదీశారు.
మరోవైపు బస్సులోని ఇతర ప్రయాణికులు కూడా ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తిని తిరిగి బస్సు ఎక్కనివ్వలేదు. అనంతరం ఆ ప్రయాణికురాలికి బస్సులో మరో సీటు కేటాయించారు. అయితే ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆమె ముందుకు రాలేదు.
Joe Biden | విమానం ఎక్కుతూ పడిపోబోయిన అమెరికా అధ్యక్షుడు.. వీడియో వైరల్..!
Sukesh Chandrasekhar: జైలు గదిలో లగ్జరీ వస్తువులు.. బోరున ఏడ్చేసిన సుకేశ్ చంద్రశేఖర్.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

