Tejpratap Yadav : భోజ్‌పురి సింగర్, నటుడు పవన్ సింగ్ (Pawan Singh) ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ బీజేపీలో చేరుతారా..? అనే చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు జన్‌శక్తి జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ (Tejpratap Yadav) ముందు లేవనెత్తారు. దాంతో ఆయన పవన్ సింగ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పవన్‌సింగ్ ఎప్పుడూ ఎవరో ఒకరి కాళ్లపై పడుతుంటాడని తేజ్ ప్రతాప్ వ్యాఖ్యానించారు. కానీ ఆయన మేథావీతనం, తెలివితేటలు ఇప్పుడు పనిచేయవనే సంగతి ఆయన అర్థం కావడంలేదని అన్నారు. అతడు ఒక కళాకారుడని, ఆయన కళా ప్రదర్శనలు చేసుకోవాలని సూచించారు. ఆయన రాజకీయాల్లో ఎందుకు జోక్యం చేసుకోవాలని ప్రశ్నించారు.